మాజీ మంత్రి కేటీఆర్ తన కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటనను సరదాగా పంచుకున్నారు. స్నేహితుడు కళ్యాణ్ కోసం హైదరాబాద్ వదిలి గుంటూరులోని ఒక కళాశాలలో చేరినట్లు తెలిపారు. అయితే, పరీక్షలో ఒత్తులు సరిగ్గా రాయకపోవడంతో 25 మార్కులకు కేవలం 4 మార్కులే వచ్చాయని చెప్పారు. దీనిపై ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా, ఆయన తన చెంప చెల్లుమనిపించారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన ఆయన కాలేజీ జ్ఞాపకాల్లో ఒకటని తెలిపారు.