బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరంగల్‌లో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో మాట్లాడుతూ, కాంగ్రెస్ 60 ఏళ్లుగా రైతుల రక్తం తాగిందని, రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన 34 హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని రెన్యువల్ సీఎం అని, ఎ.రేవంత్ రెడ్డి అంటే ఎగవేతల రేవంత్ రెడ్డి అని విమర్శించారు. పూర్తి రుణమాఫీ జరిగిందని ఏ ఊరిలోనైనా రైతులు చెబితే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.