రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. మండల కాంగ్రెస్ నాయకుడు జాలగం ప్రవీణ్ (టోనీ) నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ SC సెల్ అధ్యక్షుడు అకునూరి బాలరాజు, సోషల్ మీడియా ఇన్‌చార్జి గడ్డం మధుకర్ (చోటు)తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నాయకులు ఇందిరా గాంధీ చేసిన భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ వంటి విప్లవాత్మక నిర్ణయాలను స్మరించుకున్నారు.