సిరిసిల్లలో గురువారం తెలంగాణ రాష్ట్ర 108 సేవల ఆడిటింగ్ అధికారి వెంకటేష్, జిల్లా మేనేజర్ సవనపల్లి అరుణ్ కుమార్‌తో కలిసి 108 అంబులెన్స్‌లను తనిఖీ చేశారు. వెంటిలేటర్, మానిటర్, ఇన్ఫ్యూషన్ పంప్, AED, సక్షన్ పరికరం, ఇంక్యుబేటర్, ఆక్సిజన్ నిల్వలు, అత్యవసర మందులు, ఇంజక్షన్లు, రికార్డులను పరిశీలించి, పరికరాలు, మందులు అందుబాటులో ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండి మెరుగైన సేవలు అందించాలని, రిపేర్ అవసరమైతే అధికారులకు తెలియజేయాలని సూచించారు. పెద్ది శ్రీనివాస్, వడ్నాల అనిల్ కుమార్, పోచంపల్లి పరశురాములు, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.