జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం పలువురు టీడీపీ నేతలు గులాబీ పార్టీలో చేరారు. HYDలోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీడీపీ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ నాయుడు, ఇతర టీడీపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.