తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాత్రి తొమ్మిది గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం, కాంగ్రెస్ 2077, బీఆర్ఎస్ 1097, బీజేపీ 241, ఇతరులు 597 అభ్యర్థులు గెలుపొందారు. అయితే, సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ 30 సర్పంచ్ స్థానాలకు గాను 20 స్థానాలు గెలుచుకుని తన ప్రభంజనాన్ని కొనసాగించింది. అధికార కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మూడవ స్థానంలో నిలిచి డిపాజిట్లు కోల్పోయినట్లు సమాచారం. బీజేపీ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఆయన హవా కొనసాగింది.