కేటీఆర్ అమెరికా పర్యటన.. కొలంబియా యూనివర్సిటీలో కీలక ప్రసంగం

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) వారం రోజుల పాటు అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించనున్న "కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026"లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వ్యూహాలపై తన అనుభవాలను, అంతర్దృష్టులను పంచుకుంటారు. ఈ వ్యాపార సదస్సుతో పాటు, కేటీఆర్ తన కుమారుడు హిమాన్షును కూడా కలవనున్నారు.
