మద్దిమల్ల రాయిని చెరువు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ
బీజేపీ నాయకులు సోమవారం పాదయాత్ర చేపట్టారు. చెరువు నుంచి వీర్నపల్లి ఎంఆర్వో కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. నైన్త్ ప్యాకేజీ పనులు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.