రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నిషేధించిన చైనా మంజా (నైలాన్/సింథటిక్ దారాలు) విక్రయం, వినియోగంపై జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించే వ్యాపారులపై ఆకస్మిక తనిఖీలు చేపడతామని తెలిపారు. ఈ మంజా మనుషులకు, వాహనదారులకు, పక్షులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఈ నిషేధం అమలు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.