రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామ అటవీ ప్రాంతంలో మే డే సందర్భంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోట కూలీలు సీఐటీయూ జెండాను శుక్రవారం ఎగురవేశారు. ఎనిమిది గంటల పని దినం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాల నాయకులు జాలపెల్లి మనోజ్ కుమార్, ఎడ్ల స్వామి నినదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా సంఘాల కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.