సిరిసిల్లలోని సుందరయ్య నగర్ పీహెచ్‌సీలో పల్స్ పోలియో కార్యక్రమంలో పర్మనెంట్ మార్కర్‌కు బదులుగా బాల్‌పెన్నుతో చిన్నారుల చిటికెన వేలిపై గుర్తులు వేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీనివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించారని వారు తెలిపారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.