అబుదాబి ఎయిర్‌పోర్టుపై జరిగిన మిస్సైల్ దాడిలో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో క్లీనింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు, ఇటీవల యూఏఈ ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన ఇరాన్ మిస్సైల్ దాడిలో ఎగిరిపడిన గాజు పెంకులు తగిలి ఛాతీ, కుడి చేతికి గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.