తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. 11 కేవీ లైన్లో మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం కలుగుతుందని ఏఈ మధుకర్ తెలిపారు. తంగళ్లపల్లితో పాటు మండేపల్లి, తాడూరు గ్రామాల్లో ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.