కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.25 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం 125 రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం వీబీజీ రామ్ జీ పథకాన్ని తెచ్చినా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశించిన విధంగా పని దినాలు కల్పించడంలో విఫలమవుతోందని విమర్శించారు. అంకిరెడ్డిపల్లెలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు.