వీర్నపల్లి మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నాటక కళాకారుడు దేశరాజు సత్యనారాయణ కుటుంబానికి వీర్నపల్లి నాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం బియ్యం వితరణ చేశారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ సత్యనారాయణ మృతి నాటక కళారంగానికి తీరని లోటు అని, కళాకారులు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఐక్యంగా ఉండాలని, అలాగే కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శనాల లింబద్రి, భూత అంజయ్య, వీటూరి సతీష్, మల్లారపు దేవయ్య, దర్శనాల లక్ష్మీనారాయణ, మేకల రాజు, మృతుడి కుటుంబ సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.