సిరిసిల్లలో రోడ్డు భద్రత ర్యాలీ: యువతకు ఏఎస్పీ సూచనలు

0చూసినవారు
సిరిసిల్లలో రోడ్డు భద్రత ర్యాలీ: యువతకు ఏఎస్పీ సూచనలు
రాజన్న సిరిసిల్లలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఆర్టీఏ అధికారులు, విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, యువత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఓవర్ స్పీడ్, డ్రింక్ చేసి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ర్యాలీలో ఆర్టీవో లక్ష్మణ్, డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐ కృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్