రాజన్న సిరిసిల్ల జిల్లా
బీజేపీ ఆధ్వర్యంలో అక్టోబర్ 7న నిర్వహించనున్న సేవా జ్యోతి కలశ యాత్రకు సంబంధించి
బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో
బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, పదాధికారులు, మహిళా మోర్చా నాయకులు, సేవా సంకల్ప అభియాన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.