రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం ఏడుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఎస్సై నాగరాజు, ముస్తాబాద్ ఎస్సై గణేశ్‌లను సిరిసిల్ల టౌన్‌కు, ఎస్సై శ్రీకాంత్‌ను గంభీరావుపేటకు, ఎస్సై జ్యోతిని ముస్తాబాద్‌కు, పాక గణేశ్‌ను వేములవాడ టౌన్‌కు, మురళీధర్ గౌడ్‌ను ఎల్లారెడ్డిపేట రెండో ఎస్సైగా బదిలీ చేశారు. ఈ బదిలీలు జిల్లా పోలీసు యంత్రాంగంలో మార్పులు తీసుకువచ్చాయి.