తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో "భవాని యూత్" ఆధ్వర్యంలో శరన్నవరాత్రి సంబరాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. శనివారం దుర్గామాతకు నైవేద్యం సమర్పించి వందలాది మంది భక్తులు పాల్గొన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులు, యువత కలిసి నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం అందరి ప్రశంసలు పొందింది.