సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డు ముష్టిపెళ్లిలో నిన్న అర్ధరాత్రి దొంగలు యాదవ కుటుంబానికి చెందిన కర్తల ఎల్లవ్వ, దేవయ్య గారి 3 గొర్రెలను దొంగిలించారు. సమాచారం అందుకున్న మాజీ కౌన్సిలర్ బోల్గం నాగరాజు గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని సీఐకి తెలియజేశారు. నిరుపేద కుటుంబమైన దేవయ్య గారు గల్ఫ్ నుంచి అనారోగ్యంతో తిరిగి వచ్చి అప్పు చేసి కొనుగోలు చేసిన గొర్రెలతో జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం న్యాయం చేయాలని, దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. వార్డు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.