రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామ శివారులో ఉపాధి హామీ పనుల్లో భాగంగా కాలువ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు పార చెట్టుపై ఉన్న తేనెతెట్టకు తగలడంతో కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన కూలీలను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల కథనం ప్రకారం, ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉంది.