తంగళ్ళపల్లి మండలంలో మనస్థాపంతో మానేరు వాగులో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సల్లంగుల కృష్ణ అనే కూలి మృతదేహం శనివారం ఉదయం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. రెండు రోజుల క్రితం బ్రిడ్జి పైనుంచి దూకిన కృష్ణ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ఆచూకీ లభించకపోవడంతో, శనివారం ఉదయం మృతదేహం లభించడంతో పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.