నేరం చేసిన వారెవరూ శిక్ష నుంచి రేరస్థులు తప్పించుకోలేరని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం మొత్తం 71 కేసుల్లో 82 మందికి జైలు శిక్షలు, జరిమానాలు పడ్డాయని ఆయన స్పష్టం చేశారు. కోర్టులో పటిష్టమైన సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు