గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా
కాంగ్రెస్ గాలి వీచినా.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో మాత్రం BRS తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇదే జోరును రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ గెలుపుతో
కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని
కేటీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు సీఎం రేవంత్ సైతం గ్రేటర్‌పై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ స్థానిక లీడర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.