రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్‌ఎస్ ఎంపీలు మంత్రికి అందజేయగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కాజీపేటలో రైల్వే డివిజన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని, దీని వల్ల కార్యకలాపాల వికేంద్రీకరణ జరిగి, ఉత్తర, తూర్పు తెలంగాణలో రైల్వే సేవలు మెరుగుపడతాయని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కేవలం 900 కి.మీ. పరిధి ఉన్న గుంటూరును ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ డివిజన్ ఏర్పాటుతో 2,755 కి.మీ. రైల్వే లైన్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.