బుధవారం కోనరావుపేట మండలంలోని కొండాపూర్లో నేవూరి దేవయ్య (65) అనే రైతు తన వ్యవసాయ పొలంలో వరినాట్లు వేసేందుకు మోపెడు వాహనంపై వరినారును తరలిస్తున్నాడు. ఈ క్రమంలో మోపెడ్ వాహనం అదుపుతప్పి పొలం బురదలో పడడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.