సిరిసిల్ల: గులాబీ గూటికి వీర్నపల్లి సర్పంచ్

22చూసినవారు
సిరిసిల్ల: గులాబీ గూటికి వీర్నపల్లి సర్పంచ్
కొంతకాలంగా సీపీఎం పార్టీలో పనిచేసిన వీర్నపల్లి సర్పంచ్ దంపతులు మల్లారపు జ్యోత్స్న, అరుణ్ కుమార్, మరియు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గుండెల్లి కళ్యాణ్ మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ ఛైర్మన్ కళతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్