మల్యాలలో అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల లచ్చవ్వ అనే వృద్ధురాలు సోమవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ, కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న ఆమె జీవితంపై విరక్తి చెంది ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.