రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రానికి చెందిన మర్రిపెళ్లి సతీష్ అనే వ్యక్తి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి, గత నాలుగు రోజుల క్రితం హార్ట్ ఎటాక్ తో మస్కట్ లో మరణించాడు. మంగళవారం సతీష్ మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన భర్త గల్ఫ్ వెళ్లి అప్పులు తీర్చి క్షేమంగా ఇంటికి తిరిగివస్తాడు అనుకున్న సతీష్ భార్యకు కన్నీళ్లే మిగిలాయి. అలాగే తమ నాన్న క్షేమంగా ఇంటికి వస్తాడు అని ఎదురుచూసిన సతీష్ పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. గల్ఫ్ లో మరణించిన సతీష్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా దాతల పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.