నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాజీ మంత్రులు హరీశ్ రావు,
కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిశాంక్, కొన్ని మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసి పరువు తీశారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తానని సంపత్ కుమార్ స్పష్టం చేశారు.