రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో సమీక్ష సోమవారం నిర్వహించారు. వీవీఐపీ భద్రత, సభా ప్రాంగణం, హెలిప్యాడ్, రూట్ బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, రూట్ క్లియరెన్స్‌పై ఆయన దృష్టి సారించారు. క్షేత్రస్థాయిలో భద్రతను పర్యవేక్షించాలని, ముందస్తు తనిఖీలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఈ పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.