
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌కు AI సాయం
జపాన్ పర్యటనలో ఉన్న ఒక అమెరికన్ పర్యాటకుడికి హోటల్ ఏసీ రిమోట్ జపనీస్ భాషలో ఉండటంతో ఇబ్బంది ఎదురైంది. గూగుల్ ఏఐ టూల్ 'నానో బనానా 2' సహాయంతో, రిమోట్ ఫోటోను స్కాన్ చేసి, ఇంగ్లీష్ అక్షరాలతో కూడిన రిమోట్ చిత్రాన్ని పొందాడు. దీనితో ఏసీ సెట్టింగ్స్ మార్చుకుని హాయిగా నిద్రపోయినట్లు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది.




