వీర్నపల్లి మండలం కిరణా షాపుల్లో చైనా మంజా అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై వేముల లక్ష్మన్ తెలిపారు. చైనా మంజా వినియోగం వల్ల వాహనాలపై వెళ్తున్న వారి గొంతులు కోసుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని, ఎక్కడైనా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు.