సీఎం పర్యటనతో సందడి..పండుగను తలపిస్తున్న ప్రధాన రహదారులు

0చూసినవారు
సీఎం పర్యటనతో సందడి..పండుగను తలపిస్తున్న ప్రధాన రహదారులు
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సుమారు రూ. 345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన రహదారులు ఫ్లెక్సీలు, స్వాగత ఏర్పాట్లతో సందడిగా మారాయి. అధికారులు ట్రాఫిక్‌, పార్కింగ్‌, భద్రతపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రగుడు సమీపంలోని సభా ప్రాంగణం వరకు సీఎం పాదయాత్రగా వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్