రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఐడీఓసీలో వస్త్ర పరిశ్రమ ప్రతినిధులతో సోమవారం సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. పరిశ్రమకు రూ. 300 కోట్లకు పైగా బకాయిలు చెల్లించామని, ఇందిరా మహిళా శక్తి చీరలు, స్కూల్ యూనిఫాంల ఆర్డర్లు ఇస్తున్నట్లు, రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరిశ్రమ ప్రతినిధుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు.