ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి-దుమాల ఎంపీ నిధుల కింద బైపాస్ రోడ్డు మంజూరు కాగా అట్టి రోడ్డుకు మట్టి పోసి రోడ్డు వెడల్పు కార్యక్రమానికి చేస్తున్నటువంటి తరుణంలో దొంగతనంగా దుండగులు మట్టిని తరలించుకున్నారు. వర్షాకాలం కావడం వల్ల మట్టి పోశారు. లెవలింగ్ కోసం లేబర్స్ రాకపోవడంతో వర్షాలు ఆగిన తర్వాత రోడ్డు పోస్తామని చెప్పిన కాంట్రాక్టర్.. పోసిన మట్టిని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం ఎత్తుకెళ్లారు.