వీర్నపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు సుతారి మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, గత ఎన్నికల హామీని ప్రభుత్వం మరిచిపోయిందని, ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చలేదని విమర్శించారు. ముదిరాజుల హక్కుల సాధన కోసం రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 'ముదిరాజ్ సింహగర్జన' సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సభకు ముదిరాజ్ సోదరులు, నాయకులు, యువకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.