రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్లలోని తంగళ్లపల్లి భవిత కేంద్రంలో సోమవారం ప్రపంచ చెవిటివారి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానెల్ న్యాయవాది ఆకుల సుష్మ మాట్లాడుతూ వినికిడి లోపం వ్యక్తి సామర్థ్యానికి అడ్డంకి కాదని, విద్య, వైద్యం, సాంకేతిక పరిజ్ఞానం, సమాన అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో రాణించవచ్చని తెలిపారు. చిన్నారులకు చిన్న వయస్సు నుంచే విద్య, పునరావాస సేవలు అందించాలని సూచించారు. అనంతరం చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వినికిడి లోపం ఉన్నవారి హక్కులను కాపాడాలని ఆమె నొక్కి చెప్పారు.