గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ పై తహసీల్దార్లు, ఎంపీఓలు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఉంటుందని, సంబంధిత అప్లికేషన్లు ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, వాటిని ఎస్ఈసీ నిబంధనల ప్రకారం నింపి అందజేయాలని ఆమె సూచించారు. ఈ శిక్షణలో శిక్షణ నోడల్ అధికారి శేషాద్రి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి లక్ష్మీరాజం, ట్రైనర్లు పాల్గొన్నారు.