కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంకిరెడ్డిపల్లెలో అభివృద్ధి పనులకు, ముస్తాబాద్లో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేయనున్నారు.