రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఎల్లారెడ్డిపేట మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే మరింత నష్టం వాటిల్లుతుందని వాపోయారు.