వీర్నపల్లి మండలం కంచర్లలో కుటుంబ పెద్ద దేవోళ్ల హన్మంతు గల్ఫ్‌లో గుండెపోటుతో మరణించిన 40 రోజుల వ్యవధిలోనే, అప్పుల బాధతో ఆయన భార్య సుమలత (30) ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇద్దరు బాలికలు అనాథలయ్యారు. ఉపాధి కోసం రూ.3 లక్షల అప్పు చేసి గల్ఫ్‌కు వెళ్లిన హన్మంతు సెప్టెంబరు 26న బహ్రెయిన్‌లో మరణించారు. భర్త మరణం, అప్పులు, కుటుంబ పోషణ భారంతో మనస్తాపం చెందిన సుమలత, సోమవారం తన ఇద్దరు పిల్లలను బడికి పంపిన తర్వాత ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్సై లక్ష్మణ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు.