ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు 19.98 టీఎంసీల నీటి నిల్వ, 147.93 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,15,926 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, అదే పరిమాణంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 1,15,511 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయని, మొత్తం 11 గేట్లు ఎత్తినట్లు అధికారులు తెలిపారు.