14 నెలల్లో 1200 డెలివరీలు.. వీటిలో సహజ కాన్పులు 349

0చూసినవారు
14 నెలల్లో 1200 డెలివరీలు.. వీటిలో సహజ కాన్పులు 349
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య అభినందించారు. గత అక్టోబర్లో 105 కాన్పులు, గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 1200 కాన్పులు జరిగాయని, అందులో 349 సాధారణ కాన్పులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. గైనకాలజిస్ట్, మత్తు వైద్యులు, కాన్పుల వార్డు సిబ్బంది, పిల్లల వైద్యులను సన్మానించారు. ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పరికరాలు అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్