వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా కొనసాగుతోంది. తాజాగా 142వ వారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హనుమాన్ చాలీసాను పఠించారు.