బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళి

4చూసినవారు
బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళి
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని తెలంగాణ చౌక్‌లో బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ నేతలు పొలాస నరేందర్, లింగంపల్లి దేవయ్య మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్