నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

1చూసినవారు
శుక్రవారం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ప్రజలందరూ సహకరించాలని కోరారు. వేములవాడలో 58, సిరిసిల్లలో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, రెండు మున్సిపాలిటీల్లో నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. ఫలితాలు వెలువడే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :