రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఘన, ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, పర్యావరణ ఉత్సవాల సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, 2026 ప్లాస్టిక్ వేస్ట్ నిర్వహణపై అవగాహన కల్పించే పోస్టర్లను మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు.