కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మాజీ కౌన్సిలర్ గూడూరు మధు, గూడూరు లక్ష్మిలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 25వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా మధు పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ, 'మధు మనోడే.. తన సొంత ఇల్లు తలుపులు తన కోసం ఎప్పుడు తెరిచే ఉంచాం. మున్సిపల్ పోరులో గట్టి పోటీ ఇస్తాం' అని తెలిపారు.