రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, పరీక్షా కేంద్రంలో కనీస వసతుల కల్పనను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.